Gold Smuggling | ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ మూడు రోజుల పాటు కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు.
బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నందుకు వీరిపై 20 కేసులు నమోదు చేసినట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. బంగారం కడ్డీలను ప్రయాణికులు తమ లోదుస్తులు, దుస్తులు, కార్డ్ బోర్డ్ షీట్, బెల్ట్ తదితర వస్తువుల్లో దాచి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారన్నారు. ఒక ప్రయాణికురాలు బుర్ఖాలో, మరొకరు లోదుస్తుల్లో దాచి పెట్టారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మరొక ప్రయాణికుడు మలద్వారం వద్ద మైనం రూపంలో బంగారం దాచి తరలిస్తూ దొరికి పోయాడని చెప్పారు.