లక్నో: ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు. (Monkey Caused Road Accident) ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం దోమ్గఢ్ ప్రాంతంలో మొరాదాబాద్ – అలీగఢ్ జాతీయ రహదారిపైకి కోతి వచ్చింది. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ సడెన్‌గా కోతిని గమనించి తప్పించబోయి కారును ఢీకొట్టాడు. ఆ కారులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతులను యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ సౌరభ్ శ్రీవాస్తవ, క్యాషియర్ దివ్యాన్షు, అమిత్‌గా గుర్తిచారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన అమిత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై అకస్మాత్తుగా కోతి కనిపించడం ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.