శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 03, 2020 , 11:39:32

తండ్రి చేతిలో న‌లుగురు పిల్ల‌ల దారుణ హ‌త్య‌

తండ్రి చేతిలో న‌లుగురు పిల్ల‌ల దారుణ హ‌త్య‌

పాట్నా : మ‌తిస్థిమితం కోల్పోయిన ఓ తండ్రి త‌న న‌లుగురు పిల్ల‌ల‌ను క‌త్తితో పొడిచి చంపాడు. భ‌ర్త ఉన్మాద చ‌ర్య నుంచి భార్య‌, మ‌రో కూతురు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని సివాన్ జిల్లాలో చోటు చేసుకుంది. అవుదేశ్ చౌద‌రి అనే వ్య‌క్తి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. కూర‌గాయ‌ల‌తో పాటు ఓ ప‌దునైన క‌త్తిని ఇంటికి తీసుకువ‌చ్చాడు. అనంత‌రం కుటుంబంపై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. న‌లుగురు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. భార్య రిటా దేవీ, కూతురు అంజ‌లి తీవ్ర గాయాల పాల‌య్యారు. మృతుల‌ను జ్యోతి కుమార్‌(18), అభిషేక్ కుమార్(14), ముఖేష్ కుమార్‌(10), భోలా కుమార్‌(12)గా పోలీసులు గుర్తించారు.  

నిందితుడు అవుదేశ్ చౌద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌త కొంత‌కాలం నుంచి మ‌తిస్థిమితం కోల్పోయాను. కొద్దిరోజుల నుంచి మెడిసిన్స్ కూడా తీసుకోవ‌డం ఆపేశాను అని నిందితుడు పోలీసుల‌కు తెలిపాడు. అయితే మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా త‌న శ‌రీరంలోకి తెలియ‌ని శ‌క్తి ఏదో ప్ర‌వేశించింది. కుటుంబ స‌భ్యుల‌ను చంపేయాల‌ని ఆ శ‌క్తి త‌న‌ను ఒత్త‌డి చేసింద‌ని అందుకే క‌త్తితో దాడి చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. అస‌లు ఎందుకు చంపాల్సి వ‌చ్చిందో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌న్నారు. 


logo