శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 17:35:35

యువతిపై లైంగికదాడి

యువతిపై లైంగికదాడి

ముంబై : ముంబైలోని జుహుతారా రోడ్డులోని వస్త్ర దుకాణంలో పనిచేసే వ్యక్తి అదే దుకాణంలో పని చేసేందుకు వచ్చిన యువతి (22)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 5న జరగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంటాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది తెలిపిన వివరాలివి.. జుహుతారా రోడ్డులోని వస్త్ర దుకాణంలో రోజువారీగా పని చేసేందుకు వచ్చిన యువతిని మేనేజర్‌ సమీపంలోని మరో షాపునకు వెళ్లాలని సూచించాడు.

ఆమె వెళ్లే సమయానికి దుకాణంలో సహోద్యోగి వికాస్‌ వర్మ ఒక్కడే ఉన్నాడు. దీంతో యువతిపై కన్నేసిన వికాస్‌ వర్మ దుకాణం తెరిచి ఉంచితే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వేధిస్తారని నమ్మించి షట్టర్‌ మూసివేశాడు. అనంతరం లైట్లు, సీసీ కెమెరాలు స్వీచ్‌ ఆఫ్‌ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శాంటాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్‌ కోరేగాంకర్‌ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 342, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.logo