ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. ఆన్లైన్ అడ్డాగా రోజుకో స్కామ్‌తో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల కేసుల సంఖ్య ఏకంగా 212 శాతం అధికంగా ఉందని ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశారు. ఇక లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యక్తిని కస్టమ్స్ డ్యూటీ అధికారులుగా చెప్పుకున్న స్కామర్లు ఏకంగా రూ. 2.25 కోట్లకు మోసం చేయడం కలకలం రేపింది.
చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసే వ్యక్తిని సంప్రదించిన స్కామర్లు తమను తాము కస్టమర్స్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌తో కూడిన పార్సిల్‌ను బాధితుడి ఆధార్ కార్డు ఉపయోగించి విదేశాలకు పంపుతుండగా తాము సీజ్ చేశామని చెప్పారు. కేసును సీబీఐకి బదలాయించారని, మీ వద్ద ఉన్న సేవింగ్స్‌లో 70 శాతం చెల్లిస్తే కేసు లేకుండా చేస్తామని నమ్మబలికారు.
ఆర్బీఐ తనిఖీ అనంతరం డబ్బు తిరిగి పంపుతామని మభ్యపెట్టారు. స్కామర్ల మాటలకు కలత చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వారి సూచనలకు అనుగుణంగా వారు చెప్పిన ఖాతాలకు రూ. 2.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై ఇంకా డబ్బు పంపాలని స్కామర్లు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Read More :