Deepfake | డీప్‌ఫేక్ (Deepfake).. ఈ పదం ప్రస్తుతం అందరినోట్లో నానుతోంది. అందుకు కారణం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో వైరల్ కావడమే. జారా పటేల్ (Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి ఏఐ సాంకేతికతతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, రష్మికే కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) కూడా డీప్‌ఫేక్ బాధితురాలే. కత్రినాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
కత్రినా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టైగర్ 3 (Tiger 3) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె చేసిన టవల్ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఓ హాలీవుడ్ స్టంట్ ఉమన్‌తో కలిసి కత్రినా పోరాట దృశ్యాలు ఇప్పటికే ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కొందరు ఆ దృశ్యాలను మిస్యూజ్ చేశారు. ఒరిజినల్ ఫైట్సీన్లో కత్రినా టవల్ కట్టుకుని ఫైట్ చేయగా (Towel-Clad fight).. ఏఐ సాంకేతికతో వాటిని మార్ఫింగ్ చేసేశారు. డీప్‌ఫేక్ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఈ అంశం కాస్తా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.
Katrina Kaif Deepfake Photo: रश्मिकानंतर आता कतरिना कैफ डीप फेकच्या जाळ्यात!#entertainment #KatrinaKaif @KatrinaKaifFB #deepfakePhoto #RashmikaMandannahot @iamRashmika @RashmikaTrends https://t.co/qUNOH3vKPj
— LetsUpp Marathi (@LetsUppMarathi) November 7, 2023
మనీశ్ శర్మ దర్శకత్వంలో హై బడ్జెట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న టైగర్ 3 మూవీలో కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో కత్రినాకైఫ్‌పై వచ్చే యాక్షన్ సీన్‌పై ఇప్పుడు నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. కత్రినాకైఫ్ టవల్ ఫైట్ సీన్.. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎన్నడూ చూడని హాటెస్ట్ ఫైట్ సీన్‌గా నిలువడం ఖాయమని, థియేటర్లు స్టేడియంలా మారేందుకు ఈ ఒక్క సీన్ చాలు అని అంటున్నారు నెటిజన్లు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
#KatrinaKaif Towel fight Scene gonna Blow Your Mind … 💥 💥 #Tiger3
Hottest Action Scenes Ever. 🥵🔥
Katrina towel fight hottest scene will turn theaters into stadium 🤤🥵🔥#SalmanKhan #Tiger3Diwali2023#EmraanHashmi #Katrina #Tiger3FirstDayFirstShow #FDFS pic.twitter.com/UfwFSA4ife
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) November 6, 2023
Also Read..
Naga Chaitanya | భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై నాగచైతన్య
Zara Patel | ఈ ఘటనతో తీవ్రంగా కలతచెందా.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై జారా పటేల్ ఆవేదన