Naga Chaitanya | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అందుకు కారణంగా ఆమెకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ కావడమే. కొందరు జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య స్పందించారు.
‘టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తుంటే నిజంగా ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇది ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆలోచన మరింత భయానకంగా ఉంది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని బారిన పడిన బాధితులైన వారిని రక్షించడానికి కఠిన చట్టాల్ని అమలు చేయాలి’ అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
It’s truly disheartening to see how technology is being misused and the thought of what this can progress to in the future is even scarier.
Action has to be taken and some kind of law has to be enforced to protect people who have and will be a victim to this .Strength to you. https://t.co/IKIiEJtkSx— chaitanya akkineni (@chay_akkineni) November 6, 2023
ఇంతకీ ఏం జరిగిందంటే..
కొందరు ఆకతాయిలు (Rashmika Mandanna) ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. వీడియోపై సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఊహిస్తేనే భయంగా ఉంది : రష్మిక
‘ఇలాంటి విషయాలను పంచుకోవడం చాలా బాధగా ఉంది. ఈ సమయంలో నాపై గౌరవంతో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మానసికంగా ఎదిగిన స్త్రీని కనుక ఈ పరిస్థితిని ఫేస్ చేయగలిగాను. అదే నేను చదువుకునే రోజుల్లో ఇలాంటివి సంభవిస్తే, ఎలా తట్టుకునేదాన్నో అని ఊహిస్తేనే భయంగా ఉంది. స్త్రీలకు ఈ టెక్నాలజీ ఒక శాపం. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని చెప్పింది రష్మిక.
I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online.
Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.…
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023
కేంద్ర ఐటీ శాఖ..
ఈ సంఘటనపై కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించింది. ‘మార్ఫింగ్ అత్యంత ప్రమాదకరమైన చర్య. దీన్ని పరిష్కరించాల్సింది కూడా సామాజిక మాధ్యమాలే. కొత్త నిబంధనల ప్రకారం ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను గుర్తిస్తే, వాటిని 36 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన పాటించని వారు శిక్షార్హులు. ఈ నేరం చేసిన దోషుల్నీ, సదరు సామాజిక మాధ్యమాలను రూల్ 7 కింద కోర్టుకు లాగొచ్చు. ఈ వ్యవహా రంపై కేంద్ర సీరియస్‌గా ఉంది’ అని తెలియజేశారు.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
Also Read..
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Alia Bhatt | ఆ చీరంటే నాకు పిచ్చి.. పెండ్లి తర్వాత జీవితంపై ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్