Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)కు ఊహించని అనుభవం ఎదురైంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే (Empty Bouquet)ను అందించారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)కు ఊహించని అనుభవం ఎదురైంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే (Empty Bouquet)ను అందించారు. దీంతో కొంత ఆశ్చర్యానికి గురైన ప్రియాంక.. స్టేజ్‌పై నవ్వు ఆపుకోలేకపోయింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (Madhya Pradesh Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నాయి. అక్కడ గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆ తర్వాత తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ( Indore)లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఎన్నికల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
స్టేజ్‌పైకి వచ్చిన ప్రియాంక గాంధీకి స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్ప గుచ్ఛంతో సాదర స్వాగతం పలికారు. అయితే, ఆ బొకే చూసిన ప్రియాంక.. నవ్వు ఆపుకోలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అందించిన బొకే ఖాళీగా ఉంది. అందులో పువ్వులు ఏమీ లేకపోవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన ప్రియాంక.. ఆ తర్వాత నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023
Also Read..
Alia Bhatt | ఆ చీరంటే నాకు పిచ్చి.. పెండ్లి తర్వాత జీవితంపై ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mizoram Assembly Elections: మిజోరంలో ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు.. 96 ఏళ్ల అంధుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

