Car Hit And Drag | వాహన తనిఖీలు చేస్తున్న పోలీసును ఢీ కొట్టి.. 400 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్
Car Hit And Drag | గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. సూరత్ (Surat)లో వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిని కారు ఢీ కొట్టింది. అనంతరం అలాగే 400 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
Car Hit And Drag | గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. సూరత్ (Surat)లో వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిని కారు ఢీ కొట్టింది. అనంతరం అలాగే 400 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కతర్గాం ప్రాంతం (Katargam area)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సూరత్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఝలా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కతర్గాం పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం స్థానిక అల్కాపురి ఓవర్ బ్రిడ్జి (Alkapuri overbridge) కింద వాహన తనిఖీలు (vehicle checking) చేపట్టారు. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేని తెల్లటి స్కోడా కారును గుర్తించారు. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ వేగంగా వెళ్లి ఓ పోలీసును ఢీ కొట్టాడు. దీంతో సదరు పోలీసు కారు బ్యానెట్ (Cars Bonnet)పై ఉండిపోయాడు. డ్రైవర్ కారును ఆపకుండా 300 నుంచి 400 మీటర్ల దూరం అలానే ఈడ్చుకెళ్లాడు. తనిఖీల్లో పాల్గొన్న ఇతర పోలీసులు ఆ కారును ఆపేందుకు దాని వెంటే అనుసరించారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు.. స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో బ్యానెట్‌పై ఉన్న పోలీసు అధికారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ పోలీసును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను గౌతమ్ జోషీగా గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.
Also Read..
Congress | పటాన్చెరు కాంగ్రెస్‌లో చిచ్చు.. నీలం మధుకు టికెట్‌పై కాటా శ్రీనివాస్ అనచరుల ఆగ్రహం
Mizoram Assembly Elections: మిజోరంలో ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు.. 96 ఏళ్ల అంధుడు
Rachin Ravindra | వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్.. జాక్‌పాట్ కొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

