Congress | పటాన్చెరు కాంగ్రెస్‌లో చిచ్చు.. నీలం మధుకు టికెట్‌పై కాటా శ్రీనివాస్ అనచరుల ఆగ్రహం
కాంగ్రెస్‌లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
సంగారెడ్డి: కాంగ్రెస్‌లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ప్రకటించిన మూడో జాబితా పటాన్చెరు (Patancheru) కాంగ్రెస్‌లో అగ్గి రాజేసింది. ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు (Neelam Madhu) కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోస్టర్లు, బ్యానర్ల కాల్చేశారు. పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
గత తొమ్మిదేండ్లుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న కాటా శ్రీనివాస్‌ను కాదని మధుకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ 80 వేల ఓట్లు తెచ్చుకున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా రాజకీయ ప్రలోభాలకు లోనై కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

