మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 20:35:37

పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

కుమురంభీం ఆసిఫాబాద్‌ : జిల్లాలోని లింగాపూర్‌ మండలం మామిడిపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. లింగాపూర్‌ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీంరావు(22), జైనూర్‌ మండలం రాశిమెట్ట గ్రామానికి చెందిన మడావి విజయ(20) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా అటవీప్రాంతంలో ఇరువురు బుధవారంనాడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


logo