హైదరాబాద్ : పిడుగుపాటుకు భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు బలయ్యారు. రేగొండ మండలం పొనగండ్లలో పిడుగుపాటుతో రైతు వంగ రవి (50) అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. చిట్యాల మండలం గోపాలపూర్లో ఆరెపల్లి వనమ్మ (56) పిడుగుపాటుతో మహిళ మృతి చెందింది. ఇద్దరి మృతితో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది.