పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
క్రైం న్యూస్ | పిడుగుపాటుకు మేకల కాపరి, నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన పుల్కల్ మండల పరిధిలోని పోచారం గ్రామంలో చోటు చేసుకుంది.

పుల్కల్ రూరల్/సంగారెడ్డి : పిడుగుపాటుకు మేకల కాపరి, నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన పుల్కల్ మండల పరిధిలోని పోచారం గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి గ్రామానికి చెందిన మేకల కాపరి బుసిరెడ్డిపల్లి చంద్రయ్య (55 )సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం గ్రామానికి చెందిన బుసిరెడ్డిపల్లి చంద్రయ్య మేకలు మేపేందుకు అడవికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో వారు తమ మేకలను తీసుకొని ఇంటికి రావడానికి బయలుదేరారు.
మార్గ మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పిడుగుపడి బుస రెడ్డి పల్లి చంద్రయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అతనితోపాటు నాలుగు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. అతడి వెంట ఉన్న ఏసుకూన దొడ్డి నర్సింలు కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

