సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించుకోరు. అలాగే ఇద్దరు యువకులు తమ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై స్టంట్లు చేయడం కెమెరాకు చిక్కింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్లు.. ముందు టైర్‌ను గాల్లోకి లేపి, ఒక్క చక్రంపై బండిని నడుపుతూ విన్యాసాలు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బైక్‌ను, దాన్ని నడిపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు షేర్ చేశారు. ఇలాంటి పనులు చేస్తే.. వాళ్లపై కేసు బుక్ చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
" If you are wheeling, We are waiting to book case against you ".
ಏರ್ ಪೋರ್ಟ್ ಸಂಚಾರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ಕುಂದಲಹಳ್ಳಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಮಾನವ ಜೀವಕ್ಕೆ ಅಪಾಯಕಾರಿ ಆಗುವ ರೀತಿಯಲ್ಲಿ ವೀಲಿಂಗ್ ಮಾಡುತ್ತಿದ್ದ ದ್ವಿ ಚಕ್ರ ವಾಹನ ಸವಾರನನ್ನು ಮತ್ತು ವಾಹನವನ್ನು ಜಪ್ತಿ ಪಡಿಸಿಕೊಂಡು ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಲಾಯಿತು. pic.twitter.com/K2NUrRTpYL
— DCP Traffic East (@DCPTrEastBCP) June 4, 2022