Rashmika | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహంపై గత కొన్ని రోజులుగ వాడి వేడి చర్చ నడుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలే రష్మిక అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించిందన్న సమాచారం బయటకు రావడంతో ఈ రూమర్స్ మరింత వేగం పుంజుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై ఇద్దరు నటుల తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రష్మిక తన వివాహ వార్తలపై మొదటిసారి స్పందించింది.
రూమర్స్‌ను ఖండించలేనని, ప్రస్తుతం మాత్రం ఏ విషయాన్నీ ధ్రువీకరించలేనని చెప్పింది. తన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడాలో, వివరాలు ఎప్పుడు షేర్ చేసుకోవాలో అనే విషయం తనకే తెలుసని, సరైన సమయానికి అందరితో పంచుకుంటానని రష్మిక స్పష్టం చేసింది. ఇప్పుడే ఏ వివరాలూ చెప్పలేనని రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్–రష్మికలు ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ ఫోటో కాని, అధికారిక అనౌన్స్మెంట్ చేయకపోవడంతో, ఇద్దరూ ప్రత్యేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
ఎప్పుడు అధికారిక సమాచారం వస్తుందోనని నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. గీత గోవిందంతో హిట్ కాంబినేషన్‌గా నిలిచిన విజయ్–రష్మిక, ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో కూడా అదే కెమిస్ట్రీని కొనసాగించారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమాకు జోడీగా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి., రీల్ లైఫ్ కపుల్‌గా ప్రారంభమైన వారి బంధం ఇప్పుడు రియల్ లైఫ్ వరకూ వెళ్తోందన్న ఊహాగానాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది చూడాలి. ఇక రష్మిక కెరియర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటుంది. నేషనల్ క్రష్ కాస్త ఇప్పుడు వరల్డ్ క్రష్‌గా మారుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు మానేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.