హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయ్దుర్గ మై హోమ్ భుజ, బాలానగర్, రంగారెడ్డి కలెక్టరేట్ తోపాటు జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సోదరుడు, బంధువులు ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అదేవిధంగా పలు చోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మహబూబ్నగర్లో ఒక రైస్ మిల్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.