కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్(MLA Humayun Kabir)ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. బాబ్రీ మసీదుకు చెందిన నమోనా మసీదును నిర్మిస్తానని అతను ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో బాబ్రీ మసీదును నిర్మించాలని ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ భావిస్తున్నారు. ముర్సీదాబాద్కు చెందిన ఎమ్మెల్యే అకస్మాత్తుగా బాబ్రీ మసీదును నిర్మిస్తానని చెప్పినట్లు గుర్తించామని, ఇప్పుడు ఎందుకు బాబ్రీ మసీదు అవసరం వచ్చిందని, ఇప్పటికే ఆయనకు వార్నింగ్ ఇచ్చామని, పార్టీ నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హుమయూన్ కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కోల్‌కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు.