Online Scam | జాబ్ ఆఫర్ పేరుతో ఫుట్‌బాల్ కోచ్‌ను ఆడుకున్న స్కామర్లు : రూ. 10 లక్షలు గోల్మాల్
ఆన్లైన్ అడ్డాగా (Online Scam) సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో స్కామ్, పూటకో స్కీమ్‌తో దేశవ్యాప్తంగా అమయాకులను నిలువునా ముంచి రూ. కోట్లు దండుకుంటున్నారు.
న్యూఢిల్లీ : ఆన్లైన్ అడ్డాగా (Online Scam) సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో స్కామ్, పూటకో స్కీమ్‌తో దేశవ్యాప్తంగా అమయాకులను నిలువునా ముంచి రూ. కోట్లు దండుకుంటున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన ఫుట్‌బాల్ కోచ్ జోయల్ చెట్టి (28)ని సైబర్ నేరగాళ్లు ఆన్లైజ్ జాబ్ ఆఫర్‌తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 లక్షలు కొల్లగొట్టారు.
పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేస్తూ చెట్టికి వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్ వచ్చింది. డిజిటల్ ఓషియన్ అనే కంపెనీలో పనిచేసే నేహ అనే మహిళ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి వాటి స్ర్కీన్షాట్లను తమకు పంపితే డబ్బు పంపుతామని బాధితుడిని స్కామర్లు మభ్యపెట్టారు. జాబ్ ఆఫర్‌ను అంగీకరించిన బాధితుడికి స్కామర్లు టెలిగ్రాం ద్వారా లింక్ పంపి ఆపై అతడి బ్యాంక్ ఖాతా వివరాలు, యూపీఐ ఐడీ సహా వ్యక్తిగత వివరాలను రాబట్టారు.
తొలుత పలు టాస్క్‌లపై చిన్న మొత్తాలకు అధిక రిటన్స్ అందించి బాధితుడి విశ్వాసం చూరగొన్న స్కామర్లు ఆపై భారీ స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం ఈనెల 16 నుంచి 21 మధ్య రిజిస్ట్రేషన్ ఫీజు, పెట్టుబడుల పేరుతో బాధితుడి నుంచి రూ. 9.8 లక్షలు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. అటు తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో పాటు రిటన్స్ విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Rolls-Royce crash | ర్యాష్ డ్రైవింగ్ : కుబేర్ గ్రూప్ డైరెక్టర్‌కు పోలీసుల నోటీసులు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

