ఆదివారం 05 జూలై 2020
Crime - May 19, 2020 , 08:52:27

పూరిగుడిసె దగ్ధం.. వృద్ధురాలి మృతి

పూరిగుడిసె దగ్ధం.. వృద్ధురాలి మృతి

పెద్దపెల్లి: జిల్లాలోని గోదావరిఖని ఇందిరానగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పూరిగుడిసె దగ్ధమయ్యింది. దీంతో మంటలు అంటుకుని బోనాల అనసూర్య అనే వృద్ధురాలు అగ్నికి ఆహుతయ్యింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన ఒక ప్రముఖ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo