బుధవారం 03 మార్చి 2021
Crime - Jan 17, 2021 , 12:58:34

పెళ్లి చేయమన్నందుకు కొడుకుపై దాడిచేసిన తండ్రి

పెళ్లి చేయమన్నందుకు కొడుకుపై దాడిచేసిన తండ్రి

రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. త్వరగా పెళ్లి చేయమని అడినందుకు కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటన కొత్తూరు మండలం చేగూర్‌లో చోటుచేసుకు న్నది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, నరేశ్‌లు తండ్రీ కొడుకులు. వివాహం విషయమై తండ్రీ కొడుకుల మధ్య వివాదం తలెత్తింది. తనకు తొందరగా పెళ్లి చేయాలని తండ్రిపై నరేశ్‌ గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే విషయమై తండ్రీ కొడుకులు వాదులాడుకున్నారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఎల్లయ్య.. నరేశ్‌పై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను స్థానికులు నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ నరేశ్‌ మృతిచెందాడు. కాగా, నరేశ్‌పై దాడికి పాల్పడిన ఎల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

VIDEOS

logo