మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 19:57:40

రూ.కోటి విలువైన హెరాయిన్‌తో పట్టుబడిన తండ్రీకొడుకులు

రూ.కోటి విలువైన హెరాయిన్‌తో పట్టుబడిన తండ్రీకొడుకులు

ఐజావ్ల్‌ : మిజోరంలో రూ. కోటి విలువైన హెరాయిన్‌తో తండ్రీకొడుకులు పట్టుబడ్డారు. పొరుగున ఉన్న మయన్మార్ నుంచి రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తున్న 1.9 కిలోల హెరాయిన్‌తో ఒక వ్యక్తిని, అతడి కుమారుడిని మీజోరం పోలీసులు అరెస్టు చేసినట్లు ఉన్నత స్థాయి అధికారులు సోమవారం తెలియజేశారు. మిజోరం నగరానికి చెందిన 62 ఏండ్ల దుజోకిమా అనే వ్యక్తి అతడి కుమారుడు రెమ్తాంగ్‌ పుయా(౩౩)తో కలిసి ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు సీఐడీ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

నిందితులను అరెస్టు చేసి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణను సీఐడీ పోలీసులు చేపడుతున్నారు.  నిందితులు ఓ నది వద్ద ఈత కొట్టేటప్పుడు వారు పోలీసు బలగాల ఉనికిని గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో 280 గ్రాముల హెరాయిన్ అక్కడే పడిపోయిందని, దాని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అధికారి పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా కరోనా దృష్ట్యా మిజోరాం- బంగ్లాదేశ్, మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దు, త్రిపుర-అస్సాం-మణిపూర్‌తో అంతర్-రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడినప్పటికీ వివిధ మత్తు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo