Bengaluru | బెంగళూరు (Bengaluru)లో దారుణం చోటు చేసుకుంది. ఓ టెక్ కంపెనీ (Tech Firm) ఎండీ, సీఈవోను మాజీ ఉద్యోగి దారుణంగా హతమార్చాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్ టెన్షన్ లో ( Pampa Extension in Amrithahalli) ఉన్న ఏరోనిక్స్ ( Aeronics ) ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీలోకి ప్రవేశించిన మాజీ ఉద్యోగి ఫెలిక్స్ (Felix).. సంస్థ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్యణ్య (Phanindra Subramanya), సీఈవో విను కుమార్ (Vinu Kumar)పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న ఫణీంద్ర, విను కుమార్ లను ఉద్యోగులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఫెలిక్స్ కూడా ప్రస్తుతం అటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడని.. అతని బిజినెస్ కు ఫణీంద్ర, విను కుమార్ లు అడ్డుగా ఉండటంతో వారిని హతమార్చినట్లు డీసీపీ లక్షీప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also Read..
Kashmira Shah | సల్మాన్ సలహాతోనే తల్లినయ్యా : బాలీవుడ్ నటి
Heavy Rains | ఉత్తరాదిలో వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Aircraft | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్ వేపై దొర్లిన విమానం.. వీడియో