Kashmira Shah | బాలీవుడ్ నటి కాశ్మీరా షా (Kashmira Shah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ 2013లో టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ (Krishna Abhishek)ను పెళ్లి చేసుకుంది. వీరికి పెళ్లై ఇప్పటికి పదేళ్లైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది కశ్మీరా.
పెళ్లైన తర్వాత చాలా ఏళ్ల వరకు తమకు పిల్లలు పుట్టలేదని తెలిపింది. పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించినట్లు చెప్పింది. అయినా ఫలితం లేదని.. చివరికి ఐవీఎఫ్ (IVF technology) ద్వారా కూడా తల్లి అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదని తెలిపింది. దీంతో చాలా కుంగిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ చివరికి ఓ స్టార్ హీరో సలహాతో తనకు సంతానం కలిగినట్లు వివరించింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అట. సల్మాన్ చెప్పిన సలహా పాటించడం వల్లే తాము ఇద్దరు బిడ్డలకు తల్లితండ్రులైనట్లు చెప్పుకొచ్చింది.
‘పెళ్లైన తర్వాత నేను, కృష్ణ పిల్లల కోసం ఎంతో ఆరాటపడ్డాం. ప్రెగ్నెంట్ కావడానికి నా భర్తతో 14 సార్లు ప్రయత్నించా. ఎన్నో ఆసుపత్రులు తిరిగా. చివరికి ఐవీఎఫ్ కూడా ట్రై చేశా. అయినా ఫలితం లేదు. దీంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు. మీరెందుకు సరోగసి (surrogacy) ద్వారా పిల్లల్ని కనకూడదు అని. దీంతో వెంటనే అలా చేశాం. ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాం. సల్మాన్ వల్లే ఇదంతా. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం. సల్మాన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కశ్మీరా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే కశ్మీరా గ్లామర్ కోసమే సరోగసిని ఎంచుకుందంటూ కొందరు ట్రోల్స్ చేశారు. దీనిపై నటి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేసింది.
Also Read..
Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రైన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్
Heavy Rains | దేశ వ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Jharkhand | బొట్టు పెట్టుకున్నందుకు ఉపాధ్యాయుడు కొట్టాడని.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని