Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రైన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్
Boris Johnson | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Boris Johnson | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు.
35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf) జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ (Romy) జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను (Allegra Mostyn Owen) వివాహం చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అప్పుడు వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. ఆ తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్ (Marina Wheeler)ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ప్రకారం.. ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్టైర్ ( Helen Macintyre)తో ఎఫైర్ కారణంగా బోరిస్‌కు మరో బిడ్డ ఉన్నాడు.
Also Read..
Jharkhand | బొట్టు పెట్టుకున్నందుకు ఉపాధ్యాయుడు కొట్టాడని.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Heavy Rains | దేశ వ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Pregnancy | తొలి నెలలు అంటే ఏంటి? ఆ సమయంలో గర్భిణులు ఏయే పనులు చేయవచ్చు?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

