కుత్బుల్లాపూర్: నగరంలో దుండగులు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఏదో ఓ మూల నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధులపై దాడులకు, హత్యలకు తెగపడుతున్నారు. తాజాగా దుండిగల్ పీఎస్ ( Dundigal PS ) పరిధిలోని చర్చి గాగిళ్లాపూర్‌లో సుశీలమ్మ(70) అనే వృద్ధురాలు హత్యకు ( Murder ) గురైంది.
తన ఇంట్లోనే సోఫాపై రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీంతో దర్యాప్తు చేస్తున్నారు. నగలు, నగదు దోచుకోవడానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారా ?, మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.