ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 09:20:48

నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో అరెస్ట్‌ అయిన ధర్మారెడ్డి ఆత్మహత్య

నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో అరెస్ట్‌ అయిన ధర్మారెడ్డి ఆత్మహత్య

హైదరాబాద్‌ : నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో అరెస్టయిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కందాడి ధర్మారెడ్డి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాసవీ శివనగర్‌ కాలనీలో ఉరివేసుకొని ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (గవర్నమెంట్‌ కస్టోడియన్‌ ల్యాండ్‌) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాల భూమిని ధర్మారెడ్డి కుటుంబంతో పాటు మరికొందరి పేరిట నకిలీ పాస్‌ పుస్తకాలు జారీ చేసేందుకు తహసీల్దార్‌ నాగరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి నుంచి నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ సెప్టెంబర్‌లో ఏసీబీ అధికారులకు చిక్కాడు. నకిలీ పట్టా పాస్‌పుస్తకాల కేసులో ధర్మారెడ్డి, ఆయన కుమారుడుని ఏసీబీ అధికారులు సెప్టెంబర్‌ 29న అరెస్టు చేశారు. ధర్మారెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదల కాగా.. ఆయన కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి జైలులో ఉన్నారు. ఇదే కేసులో తహసీల్దార్‌ నాగరాజు అక్టోబర్‌ 14న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo