రాజన్న సిరిసిల్ల : గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సిరిసిల్లను వరదల్లో ముంచెత్తాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో గల్లంతై మృతి చెందాడు. పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన గంగ కిషన్ (35) అనే భవన నిర్మాణ కార్మికుడు మంగళవారం ఉదయం పని కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. రోడ్డుపై నుంచి పారుతున్న వరదలో నడుస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు.
బుధవారం పొలాల్లో శవమై తేలాడు. ఉదయం వాకింగ్ కి వెళ్లే వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం..
వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కిషన్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ చేయూత నందించారు. మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కిషన్ భార్య సంధ్యకు చెక్కును అందజేశారు. అలాగే తన వంతు సహాయంగా మున్సిపల్ చైర్పర్సన్ పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కిషన్‌కు భార్య సంధ్య(34) తల్లి శాంతమ్మ (60) కుమారుడు రాము (12 )కూతురు లహరి (9) ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Manny Pacquiao | బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై గురి
Heavy Rains | కందకుర్తిని ముంచెత్తిన వరద నీరు
దీక్షిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి సత్యవతి