
పూడూరు : వివాహిత, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు పూడూరు మండలం కండ్లపల్లి స్టేజీ సమీప ఫారెస్ట్‌లోని నీలగిరి తోట్లోకి వెంకట్, దేవిలు ఇద్దరు కలిసి వెళ్లారు. అక్కడే కొంత సమయం గడిపి ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చన్గోముల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
వెంకట్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయిస్తుండగా, దేవి వికారాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వెంకట్ స్వగ్రామం దౌల్తాబాద్ మండలం పెద్ద పస్లవత్ గ్రామవాసి కాగా, దేవిది ఆంధ్ర ప్రాంతానికి చెందినదని తెలిపారు. ఇద్దరు నగరంలో కూలీ పనులకు వెళ్లెవారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్వేర్వేరుగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.