Crime : ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు..

హయత్‌నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో సూర్యాపేట నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న లారీని ఓఆర్ఆర్ పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజా దాటాక బలిజగూడ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుతో పాటు లారీలో మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ మయూర్‌కు స్వల్పగాయాలు కాగా, అతన్ని వెంటనే దవాఖానకు తరలించినట్టు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు. అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఫైర్ ఇంజిన్‌తో మంటలను ఆర్పివేశారు.
కారు డైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. రెండు వాహనాలకు నష్టం జరిగిందని తెలిపారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఘటన స్థలిలో ఉన్న తోటి వాహనదారులు ఆరోపించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

