మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 15:45:01

‘మహా’ పోలీసులను వదలని కరోనా

‘మహా’ పోలీసులను వదలని కరోనా

ముంబై : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులతోపాటు అందరినీ వైరస్‌ వణికిస్తోంది. శాంతిభద్రతల సంరక్షణకు పగలూరాత్రితేడా లేకుండా శ్రమించే పోలీసులు వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 424 మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర పోలీసు శాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 16,015 మంది సిబ్బందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 11,688 మంది చికిత్సకు కోలుకున్నారు. 2,838 మంది దవాఖానలో చికిత్స పొందుతుండగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు 163 మంది మృతి చెందారని పేర్కొంది. ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌-19 నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి మొత్తం రూ .23.71 లక్షల జరిమానా వసూలు చేశారు. సుమారు 2.47 లక్షల కేసులు నమోదయ్యాయి. 96,121 వాహనాలను సీజ్‌ చేసి 34,361 మందిని అరెస్టు చేసినట్లు పోలీసుశాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo