Road Accident | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొని, రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి. కారులో ఉన్న దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు కోసం తవ్విన గుంతలో ఆ వాహనాలు పడిపోయాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.