Hyderabad | హైదరాబాద్ ఎల్బీ నగర్ (LB Nagar) లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ (Car Friver).. హఠాత్తుగా కారు డోర్ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్కు కారు డోర్ తగిలింది. దీంతో బైక్పై ఉన్న దంపతులు సహా రెండేళ్ల చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ధనలక్ష్మి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
CM KCR | విద్యుత్తు సరఫరాలో తెలంగాణ కీర్తి.. పవర్ హాలిడేలే లేవు : సీఎం కేసీఆర్
CM KCR | సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన తెలంగాణ: సీఎం కేసీఆర్
MLC Kavitha: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత