Cyber Fraud | వ్యాపారం పేరుతో భారీ స్కెచ్ : వ్యాపారిని రూ. 3.3 కోట్లకు ముంచిన మహిళ
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల (Cyber Fraud) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకో స్కామ్, గంటకో స్కీమ్‌తో సైబర్ స్కామర్లు ఆన్లైన్ అడ్డాగా చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.
ముంబై : దేశవ్యాప్తంగా సైబర్ నేరాల (Cyber Fraud) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకో స్కామ్, గంటకో స్కీమ్‌తో సైబర్ స్కామర్లు ఆన్లైన్ అడ్డాగా చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త సైబర్ ఫ్రాడ్‌లో ఏకంగా రూ. 3.3 కోట్లు నష్టపోయారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఓ ఉక్రెయిన్ మహిళ వ్యాపారిని సంప్రదించింది. రూ. 8 కోట్లతో కూడిన పార్సిల్ పంపానని చెబుతూ వ్యాపారిని నిండా ముంచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ మహిళ ఎసీమాగా తనను తాను పరిచయం చేసుకున్న నిందితురాలు ముంబైలో ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిని ఈమెయిల్లో సంప్రదించింది.
భారత్‌లో తాను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని ఆమె నమ్మబలికింది. బాధితుడి కంపెనీ నుంచి యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తానని వివరాలు రాబట్టింది. ఆపై వ్యాపారంలో భాగస్వామినవుతానని ప్రతిపాదించింది. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా రూ. 8 కోట్లతో కూడిన పార్సిల్‌ను పంపుతున్నట్టు పేర్కొంది. ఇక ఎసీమా నుంచి కొరియర్ బాక్స్ వచ్చినట్టు వ్యాపారికి సమాచారం అందింది.
ఇక కొద్దిరోజుల తర్వాత భారీ మొత్తంతో కూడిన బాక్స్‌ను జకార్తాలో ఇండోనేషియా అధికారులు సీజ్ చేశారని వ్యాపారికి ఫోన్ కాల్ వచ్చింది. బాక్స్‌ను పొందాలంటే పలు ఫీజులు చెల్లించాలని చెప్పారు. ఎసీమా సూచించిన విధంగా భారత్‌కు చెందిన 101 వేర్వేరు ఖాతాలకు బాధితుడు నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై మరికొంత డబ్బు పంపాలని, ఐటీ రిపోర్ట్స్, పవర్ ఆఫ్ అటార్నీ, ఇన్సూరెన్స్ డాక్యమెంట్స్ సహా పలు పత్రాలను పంపాలని స్కామర్లు కోరడం. నెలల తరబడి తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

