Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Bengaluru Traffic | బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. ఇటీవలే ఓ నెటిజన్ బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru Traffic)కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్ కార్లు ( luxurious Ferrari supercars) ట్రాఫిక్‌లో వరుస కట్టాయి.
Bengaluru Traffic | బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అలా, ఇటీవలే ఓ నెటిజన్ బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru Traffic)కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్ కార్లు ( luxurious Ferrari supercars) ట్రాఫిక్‌లో వరుస కట్టాయి. స్థానిక చర్చ్ స్ట్రీట్ బెల్ రోడ్లో సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ మధ్యలో సుమారు 10కిపైగా ఫెరారీ కార్లు ఒకదాని వెనుక చిక్కుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను @pavangamemaster అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘బెంగళూరులో ఫెరారీ ట్రాఫిక్’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. పని మీద బయటకు వెళ్లాలంటనే ట్రాఫిక్ బారులను చూసి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Also Read..
Justin Trudeau | భారత్‌తో ఉద్రిక్తతల వేళ.. దీపావళి వేడుకల్లో పాల్గొన్న కెనడా ప్రధాని ట్రుడో
Haryana CM | మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

