Haryana CM | మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం.. వీడియో వైరల్
Haryana CM | సీఎం తన నివాసం నుంచి బయటకు వస్తున్నారంటే చాలు పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపడతారు. సీఎం తిరగాడే ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి దూసుకుంటారు. భారీ కాన్వాయ్, చుట్టూ భారీ భద్రత మధ్య సీఎం తన పర్యటను కొనసాగిస్తుంటారు. అయితే, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మాత్రం ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు.
Haryana CM | సీఎం తన నివాసం నుంచి బయటకు వస్తున్నారంటే చాలు పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపడతారు. సీఎం తిరగాడే ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి దూసుకుంటారు. భారీ కాన్వాయ్, చుట్టూ భారీ భద్రత మధ్య సీఎం తన పర్యటను కొనసాగిస్తుంటారు. అయితే, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మాత్రం ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి కాసేపు ప్రజల మధ్యలోనే తిరిగారు.
హర్యానాలోని పంచకులలో సెక్టార్-5 (Panchkula Sector-5)లో ఉన్న ఓ గ్రౌండ్లో జరిగిన ఒక మేళాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఒక సాధారణ వ్యక్తిలా కొద్దిసేపు ప్రజల మధ్యలో ఆ మేళా (Haryana Fair)లో తిరిగారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి తువ్వాల చుట్టుకుని, క్యాప్ పెట్టుకుని ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఆ సమయంలో సీఎం పక్కన ఎలాంటి భద్రతా లేదు. మేళాలో ఫుడ్‌స్టాల్ వద్ద తినుబండారాలను కొనుగోలు చేసి తిన్నారు. ఆ తర్వాత రద్దీగా ఉండే ఆ ప్రాంతం మొత్తం తిరిగి చూశారు. అక్కడ ఉన్న స్థానికులు ఆయన పక్కనే నిలబడి, అటూ ఇటూ తిరుగుతున్నా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గుర్తుపట్టలేదు. అయితే, సీఎం ఎందుకు అలా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB
— Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023
Also Read..
School Teacher | మద్యం, గంజాయి ఇచ్చి విద్యార్థితో శృంగారం.. టీచర్ అరెస్ట్
Melbourne | పబ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి
యమునా నగర్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

