Melbourne | పబ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి
Melbourne | ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెల్బోర్న్లోని రూరల్ విక్టోరియా ప్రాంతంలోని పబ్‌లోకి (Melbourne pub) ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Melbourne | ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెల్బోర్న్లోని రూరల్ విక్టోరియా ప్రాంతంలోని పబ్‌లోకి (Melbourne pub) ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
మెల్బోర్న్కు వాయువ్యంగా ఉన్న గ్రామీణ విక్టోరియా (rural Victoria)లోని డేలెస్‌ఫోర్డ్ (Daylesford)లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రాయల్ డేల్స్‌ఫోర్డ్ హోటల్ లాన్లో నిల్చున్న భారతి సంతతికి చెందిన రెండు కుటుంబాలపైకి తెల్లటి బీఎండబ్ల్యూ కారు ఒక్కసారిగా దూసుకెళ్లినట్లు తెలిపింది. ఈ ఘటనలో వివేక్ భాటియా (38), ఆయన కుమారుడు విహాన్ (11), ప్రతిభా శర్మ (44), ఆమె కుమార్తె అన్వీ (9), జతిన్ చుగ్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు విక్టోరియా చీఫ్ పోలీసు కమిషనర్ షేన్ పాటన్ వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మౌంట్ మాసిడోన్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడని, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.
Also Read..
US Strikes | సిరియాలో ఇరాన్ మద్దతున్న బలగాలపై అమెరికా వైమానిక దాడులు.. 9 మంది మృతి
Darlyn Morais | సాలీడు కాటుకు ప్రముఖ సింగర్ మృతి..!
Israel-Hamas War | ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఆయుధ విభాగాధిపతి హతం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

