Darlyn Morais | సాలీడు కాటుకు ప్రముఖ సింగర్ మృతి..!
Darlyn Morais | సాలీడు కాటుకు ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్ దేశంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్ డార్లిన్ మోరైస్ ( Darlyn Morais) ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచాడు.
బ్రసీలియా: సాలీడు కాటుకు ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్ దేశంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్ డార్లిన్ మోరైస్ ( Darlyn Morais) ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచాడు. మోరైస్ తన ముఖంపై సాలీడు కుట్టడంతో చనిపోయాడని అతని భార్య జులినీ లిస్బోవా (Jhullenny Lisboa) తెలిపింది.
మోరైస్ భార్య జులినీ లిస్బోవా వెల్లడించిన వివరాల ప్రకారం.. సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆ తర్వాత ముఖం ఉబ్బిపోయింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీ వచ్చింది. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మృతిచెందాడు.
మోరైస్ సవతి కూతురు (18) ని కూడా సాలీడు కుట్టిందని, అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జులినీ తెలిపింది. దీనిపై మోరైస్ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, మోరైస్ 15 ఏండ్ల వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించాడు. తనదైన స్టయిల్‌తో ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సోదరుడు ,స్నేహితుడితో కూడిన ముగ్గురు సభ్యుల బ్యాండ్.. టోకాంటిన్స్, గోయాస్, మారన్హావో, పారా రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నది.
కాగా మోరైస్ ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాడని, నలుగురికి సాయం చేసే వాడని అతని సమీప బంధువు వెస్లెయా సిల్వా కన్నీరు పెట్టుకున్నారు. మోరైస్ ప్రతిభను గుర్తు చేసుకుంటూ సహచర గాయకుడికి ఆయన స్నేహితులు నివాళులు అర్పించారు. కాగా, డార్లిన్ మోరైస్ మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని బ్రెజిల్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

