School Teacher | మద్యం, గంజాయి ఇచ్చి విద్యార్థితో శృంగారం.. టీచర్ అరెస్ట్
School Teacher | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతమే అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలే బైటపడింది.
School Teacher | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతమే అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలే బైటపడింది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ టీచర్ ( (School Teacher) ) తనతో శృంగారంలో పాల్గొందని ఓ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు సదరు ఉపాధ్యాయురాలిని అరెస్ట్ (Arrested) చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మాంట్గోమెరి (Montgomery) విలేజ్ మిడిల్ స్కూల్లో గతంలో మెలిసా మేరి కర్టిస్ టీచర్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె అక్కడ పనిచేయట్లేదు. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2015లో అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో బలవంతంగా శృంగారం (Sex With 14 Year Old Student) పాల్గొంది. విద్యార్థికి మద్యం, గంజాయి తాగించి మత్తులోకి దించి ఈ అఘాయిత్యానికి పాల్పడేది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్లు. కాగా, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ తనతో శృంగారంలో పాల్గొందని గత నెలలో బాధిత విద్యార్థి ఆరోపించాడు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఘటనపై స్పందించిన మాంట్గోమెరి (Montgomery County Department of Police) పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. సదరు టీచర్ సుమారు 20 సార్లకు పైగా ఆ విద్యార్థిపై శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీన ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Melbourne | పబ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి
Mike Hesson | ఇస్లామామాద్ యూనైటెడ్ హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్
Rishi Sunak | డౌనింగ్ స్ట్రీట్‌లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న ప్రధాని రిషీ సునాక్ దంపతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

