Mike Hesson | ఇస్లామామాద్ యూనైటెడ్ హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్
Mike Hesson : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ డైరెక్టర్ మైక్ హెసన్(Mike Hesson) త్వరలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో దర్శనమివ్వనున్నాడు. ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ ఇస్లామాబాద్ యూనైటెడ్( Islamabad United) జట్టు హెడ్‌కోచ్‌గా...
Mike Hesson : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ డైరెక్టర్ మైక్ హెసన్(Mike Hesson) త్వరలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో దర్శనమివ్వనున్నాడు. ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ ఇస్లామాబాద్ యూనైటెడ్ (Islamabad United) జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. అజర్ మమమూద్ స్థానంలో మైక్ హెసన్ బాధ్యతలు చేపట్టాడు. 2016, 2018లో చాంపియన్‌గా నిలిచిన ఇస్లామాబాద్ జట్టు నిరుడు సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో, అజర్‌పై వేటే వేసిన మేనేజ్మెంట్ అనుభవజ్జుడైన హెస్సన్‌కు పగ్గాలు అప్పగించింది.
హెస్సన్‌కు టీ20 ఫార్మాట్ కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. అతడు 22 ఏండ్ల వయసులోనే ఒటాగో క్రికెట్ డైరెక్టర్‌గా చేరాడు. 15 ఏండ్ల పాటు సేవలందించిన హెస్సన్ 2008లో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌గా అతడి కెరీర్ కెన్యాతో మొదలైంది. 2012 జూలైలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు.
మైక్ హెసన్, సంజయ్ బంగర్

అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. అతడి హయాంలో బెంగళూరు 2020, 2022లో నాలుగో స్థానంలో, 2021లో మూడో స్థానంలో నిలిచింది. అయితే.. 16వ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోలేకపోవడంతో, యాజమాన్యం కోచింగ్ సిబ్బందిపై వేటు వేసింది. అందులో భాగంగా సంజయ్ బంగర్‌తో పాటు హెసన్‌ను తొలగించింది.
ఇవి కూడా చదవండి
-
Melbourne | పబ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి
-
Traffic Jam | హైదరాబాద్ – విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్
-
Meg Lanning | ఆస్ట్రేలియా కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. క్రికెట్‌కు లానింగ్ వీడ్కోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

