US Singer | నేను భారతీయురాలినైతే.. బీహార్ సీఎంగా పోటీ చేసేదాన్ని.. నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్
US Singer | జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ (US Singer), ఆఫ్రికన్-అమెరికన్ నటి మేరీ మిల్బెన్ (Mary Millben) తాజాగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
US Singer | జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ (US Singer), ఆఫ్రికన్-అమెరికన్ నటి మేరీ మిల్బెన్ (Mary Millben) తాజాగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ భారత పౌరురాలిని అయి ఉంటే.. బీహార్ సీఎం పదవికి పోటీ చేసి ఉండేదాన్నని పేర్కొన్నారు.
‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జీ వ్యాఖ్యల తర్వాత.. ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాలి. బీహార్ ముఖ్యమంత్రిగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలి. నేను భారతీయురాలినైతే.. బీహార్‌కు వెళ్లి ముఖ్యమంత్రిగా పోటీ చేసేదాన్ని. బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా.. మహిళకు ఓటు వేసే శక్తిమీకుంది. మార్పుకు ఓటువేసే శక్తి మీకు ఉంది. ధైర్యవంతురాలైన మహిళ బీహార్ సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఓటు వేసి మార్పు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల బీహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని మాట్లాడారు. అయితే, ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో సీఎం నితీశ్‌కుమార్ బుధవారం నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ‘నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు తెలుపుతున్నా. జనాభా నియంత్రణలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పటం నా ఉద్దేశం. అంతే తప్ప..ఎవర్నో కించపర్చాలన్నది నా ఉద్దేశం కాదు’ అంటూ నితీశ్ వివరణ ఇచ్చుకున్నారు.
Also Read..
Justin Trudeau | భారత్‌తో ఉద్రిక్తతల వేళ.. దీపావళి వేడుకల్లో పాల్గొన్న కెనడా ప్రధాని ట్రుడో
Haryana CM | మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం.. వీడియో వైరల్
School Teacher | మద్యం, గంజాయి ఇచ్చి విద్యార్థితో శృంగారం.. టీచర్ అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

