బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 31, 2020 , 12:57:14

భూవివాదం.. అన్న చేతిలో త‌మ్ముడు హ‌తం

భూవివాదం.. అన్న చేతిలో త‌మ్ముడు హ‌తం

జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జ‌రిగింది. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య చోటు చేసుకున్న భూవివాదం ప్రాణాల మీద‌కు తెచ్చింది. న‌ర్స‌య్య‌, రాజ‌య్య అనే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గ‌త కొంత‌కాలం నుంచి భూ వివాదాలు ఉన్నాయి. అయితే గురువారం ఉద‌యం మ‌రోమారు వీరి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో అన్న న‌ర్స‌య్య‌, త‌మ్ముడు రాజ‌య్య‌పై రోక‌లిబండ‌తో దాడి చేశాడు. దీంతో రాజ‌య్య త‌ల‌కు తీవ్ర గాయం కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు తిరుమ‌ల‌గిరికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 


logo