మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 02, 2021 , 08:10:15

చెట్టును ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు యువకులు దుర్మరణం

చెట్టును ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు యువకులు దుర్మరణం

ఖమ్మం :  ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న చెట్టును ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.  కామేపల్లి మండలం పొన్నెకల్‌ గ్రామశివారులోని బుగ్గవాగు వద్ద  శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతులను పండితాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ (24), సాయి (23) గా గుర్తించారు.

ఉదయం స్నేహితుడి వివాహానికి వెళ్లిన వీరు రాత్రి తిరిగి వస్తుండగా వాగు సమీపంలోని ప్రమాదకర మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇద్దరు తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo