నిజామాబాద్ : జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా నిండు ప్రాణాలను బలితీసుకుంది. గత పది రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, ప్రమాదకరంగా పారుతున్న నదిలో ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.
గల్లంతు అయిన వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన హీరా రామ్, కేతు రామ్‌గా గుర్తించారు. వీరు గత కొన్ని ఏండ్ల క్రితమే నందిపేటకు వచ్చి స్థిరపడ్డారు. తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ
WhatsApp : భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది : మంత్రి జగదీష్‌రెడ్డి