సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 25, 2021 , 20:33:27

మిలీషియా సభ్యుల ఆరెస్టు

మిలీషియా సభ్యుల ఆరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు మిలీషియా సభ్యులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి చర్ల స్టేషన్‌ హౌస్‌ఆఫీసర్‌ బి అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కుర్నపల్లి అడవుల్లో సీఆర్‌పీఎఫ్‌ 141బెటాలియన్‌తో కలిసి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోతున్న డోకుపాడుకు చెందిన కొవాసి భీమయ్య, బూరుగుపాడు గ్రామానికి చెందిన సోడి దీపక్‌లను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ బీమయ్య, దీపక్‌ అజ్ఞాత సాయుధ సీపీఐమావోయిస్టు దళానికి చెందిన వారిగా దర్యాప్తులో తెలిసిందని పోలీసులు వివరించారు. నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీ ఖమ్మం కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.    

ఇవి కూడా చదవండి..

నాటు వేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి

ప్రేమజంట ఆత్మహత్య 

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్‌

దాతృత్వంలోనూ దయన్నే..! 

సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

ఇకపై 24 గంటలు తాగునీరు : మంత్రి జగదీష్‌రెడ్డి 

VIDEOS

తాజావార్తలు


logo