నల్లగొండ : నార్కట్పల్లి మండలం ఔరావాణిలో విషాదం చోటు చేసుకుంది. రెండేండ్ల కుమారుడి గొంతు నుమిలి చంపిన తల్లి.. అనంతరం ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సాత్విక్(2), దొడ్డి లాస్య(23)గా పోలీసులు గుర్తించారు.
అయితే లాస్య తన బిడ్డను చంపి, ఆత్మహత్య ఎందుకు చేసుకుందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాస్య ఆత్మహత్యతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.