నందిగామ : ఉరేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన లోకిని దర్శన్(28) తన భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలతో కలిసి చంద్రయాన్గూడ గ్రామంలో నివాసముండి, కారు డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య చంద్రకళ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన దర్శన్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. దర్శన్ తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.