సిద్దిపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం..మిరుదొడ్డికి చెందిన కనకరాజు, భవాని భార్యభర్తలు. కనకరాజు భార్య భవానిని ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి హతమార్చి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.