సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిన్నారం మండలం వావిరాల వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఓ బాలిక మృతి చెందింది. అయితే పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గన్ పేలిన శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు.
బాలిక మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.