నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులు, వారి కుమార్తె అక్కడికక్కడే చనిపోయారు. మరో కూతురు తీవ్రంగా గాయపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను కృష్ణయ్య(36), రజిత(33), రాఘవి(12)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న చిన్నారిని శరణ్య అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.