రంగారెడ్డి / వికారాబాద్ : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ చిన్నమ్మ హోటల్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఊట్పల్లికి చెందిన విశ్వజిత్‌గా పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ రాజీవ్ గృహ కల్ప వద్ద కూడా రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను కాను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వేర్వేరు ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.